టెక్నాలజీ సంచలనం: డిజిటల్ మార్కెటింగ్ను పూర్తిగా మారుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు పెను మార్పులు తీసుకువస్తున్నాయని నిపుణులు స్పష్టం చేశారు. వినియోగదారుల గత ప్రవర్తనను షించి వారు ఏం కొనుగోలు చేయబోతున్నారో ముందుగానే అంచనా వేయగలవని బిసి వెబ్ వైస్ క్రియేటివ్ డైరెక్టర్ అనుజా భారద్వాజ్ తెలిపారు. డేటా సిగ్నల్స్ ఆధారంగా భవిష్యత్ ప్రవర్తనను పసిగట్టడంలో ఈ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని, వ్యాపార బ్రాండ్లకు ఇది ఎంతో ప్రయోజనకరంగా మారుతోందని నిపుణులు వివరిస్తున్నారు.