భీమవరంలో పకడ్బందీ దర్యాప్తుతో నిందితుడికి జీవిత ఖైదు విధించిన కోర్టు

రిపోర్టర్: సురేష్ స్థలం: భీమవరం

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాస్త్రీయ దర్యాప్తు, పకడ్బందీ కోర్టు ట్రయల్ మానిటరింగ్ విధానంతో నిందితుడికి జీవిత ఖైదు పడేలా పోలీసులు కీలక విజయం సాధించారు. నేర విచారణ ప్రక్రియలో న్యాయస్థానంలో సాక్ష్యాధారాలను పక్కాగా ప్రవేశపెట్టడం వల్ల త్వరితగతిన న్యాయం చేకూరిందని జిల్లా పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చేసి శాంతిభద్రతలను కాపాడటంలో రాజీపడేది లేదని పోలీస్ యంత్రాంగం తేల్చిచెప్పింది.