గర్భధారణకు తొంభై రోజుల ముందే సన్నాహాలు ప్రారంభించాలని వైద్యుల సూచన

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Hyderabad

గర్భధారణకు కనీసం తొంభై రోజుల ముందే మహిళలు సన్నాహాలు ప్రారంభించాలని ప్రముఖ సంతానోత్పత్తి నిపుణుడు డాక్టర్ రాజీవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. అండం చివరి దశ అభివృద్ధికి మూడు నెలల సమయం పడుతుందని, ఈ సమయంలో పోషకాహారం, నిద్ర, జీవనశైలి చాలా కీలకమని ఆయన తెలిపారు. ఫోలిక్ ఆమ్లంతో పాటు సరైన పోషకాలు తీసుకోవాలని, నెలసరి క్రమరాహిత్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని ఆయన సూచించారు.