భారీ వర్షాల వేళ విపి రేగ కాజ్వేను పరిశీలించిన సంయుక్త కలెక్టర్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో గరివిడి మండలం విపి రేగ కాజ్వేను సంయుక్త కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ గురువారం పరిశీలించారు. చిట్టిగెడ్డ పొంగి ప్రవహిస్తుండటంతో కాజ్వేపై రాకపోకలకు ఏర్పడిన అంతరాయాన్ని ఆయన క్షేత్రస్థాయిలో సమీక్షించారు. నీటి ప్రవాహం తగ్గే వరకు రాకపోకలు నిలిపివేయాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.