చెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణం: మత్స్యకార సంఘం తీవ్ర ఆందోళన

రిపోర్టర్: మహేష్ స్థలం: అనంతగిరి

అనంతగిరి మండలంలోని ఖానాపురం గ్రామ శివారులో చెరువు శిఖం భూమిలో అక్రమంగా భవన నిర్మాణం చేపడుతున్నారని మత్స్యకార సంఘం అధ్యక్షుడు శీలం నాగేంద్రబాబు ఆరోపించారు. అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ పనులు నిలిపివేయకుండా కొనసాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నిర్మాణం వల్ల సుమారు ఆరు వందల మంది మత్స్యకారుల జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.