కాలుష్య పరిశ్రమలపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆదేశం

రిపోర్టర్: నరేష్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

ప్రజల ఆరోగ్య భద్రతే ప్రధాన లక్ష్యమని, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై వెంటనే తగిన చర్యలు చేపట్టాలని పీసీబీ అధికారులను బీఆర్ఎస్ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద ఆదేశించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని బాచుపల్లి కావ్య రెవెన్యూ కాలనీ మరియు తన్వి హిల్స్ కాలనీల ప్రాంతాలలో నెలకొన్న కాలుష్య సమస్యలపై ఆయన స్పందించారు. ఈ మేరకు స్థానిక ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని, తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని అధికారులను ఆయన స్పష్టం చేశారు.