రవాణా శాఖ కార్యాలయాల్లో తీవ్ర సిబ్బంది కొరత

రిపోర్టర్: సతీష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఏళ్ల తరబడి పోస్టులు ఖాళీగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్ల కొరతతో సేవలు అస్తవ్యస్తంగా మారాయి. రెండేళ్లుగా ఈ పరిస్థితి ఉన్నా నియామకాలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు రవాణా శాఖ ఉప కమిషనర్ తెలిపారు.