తెలంగాణలో ఇన్సర్వీస్ టెట్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ప్రత్యేక టెట్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ పరీక్షకు హాజరైన వారిలో 70.07 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. సెప్టెంబరు 8, 9 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు మొత్తం 22,477 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. అర్హత సాధించని ఉపాధ్యాయుల కోసం నవంబర్లో మరో ప్రత్యేక టెట్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.