నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఎస్ఎస్ బీ హెడ్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

రిపోర్టర్: సునీల్ స్థలం: న్యూఢిల్లీ

సశస్త్ర సీమా బల్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ పరీక్ష ఫలితాలను అధికారికంగా విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నియామక పరీక్షలో మొత్తం 1725 మంది అభ్యర్థులు తదుపరి దశకు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నవంబర్ 16 మరియు 18 తేదీలలో టైపింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.