విజయపురంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: విజయపురం
నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ విజయపురం మండలం ఆలపాకం రెవెన్యూ పరిధిలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ రాజముద్రతో కూడిన ఈ పుస్తకాలను అందజేయడం ద్వారా రైతులకు భూమిపై పూర్తి హక్కులను కల్పించామని ఆయన పేర్కొన్నారు.
'మీ భూమి - మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా ఈ పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడమే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.