విమాన ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్య: ప్రయాణం చేయవద్దని స్పష్టీకరణ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
విమాన ఛార్జీలు భారీగా పెరిగాయని దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించడానికి నిరాకరిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని న్యాయ నిపుణులు తెలిపారు. విమాన ప్రయాణం చేయకండి అంటూ పిటిషనర్ కు ధర్మాసనం సూచించినట్లు పేర్కొన్నారు. ఈ ధరల పెరుగుదల ఆర్టికల్ 14 ఉల్లంఘన కిందకు వస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించగా, విమానయాన రంగంలో ధరల నియంత్రణకు సంబంధించిన పలు పిటిషన్లపై కోర్టు విచారణ జరుపుతోందని వెల్లడించారు.