మహిళా ఎమ్మెల్యేలపై దౌర్జన్యం: సీఎం రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలి
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేతలు, మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యంపై బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ కౌరవసభను తలపిస్తోందని మండిపడ్డారు. సునీతా లక్ష్మారెడ్డి చీర లాగడం, సబితా ఇంద్రారెడ్డి గొంతు నొక్కడం అత్యంత అమానుషమని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలక్షేత్రంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.