విశాఖ ఆర్‌కే బీచ్‌లో సాగర తీర స్వచ్ఛతను పరిశీలించిన చంద్రబాబు

రిపోర్టర్: హరి స్థలం: Visakhapatnam

విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌లో సాగర తీర స్వచ్ఛత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా సముద్ర వ్యర్థాలను సేకరిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, మత్స్యకారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. అలాగే సముద్రగర్భంలోని వ్యర్థాలను సేకరించే విధానంపై స్కూబా డైవర్లతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అయ్యారు.