కరువు పనుల్లో నిర్లక్ష్యం వీడాలంటూ డీఆర్డీఏ పీడీ వార్నింగ్

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ కరువు పనుల ప్రగతిపై ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంచార్జి ఎంపీడీవో అల్లం ఇన్నారెడ్డితో కలిసి డిఆర్డీఏ పీడీ నాగిరెడ్డి పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.