ఓటు చోరీ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలంటూ కొండా సురేఖ డిమాండ్

రిపోర్టర్: సురేష్ స్థలం: వరంగల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్రమ అరెస్టుకు నిరసనగా వరంగల్ ప్రాంతంలో మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ అవకతవకలు, ఓటు చోరీ అలాగే ఎన్నికల అక్రమాలకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొండా సురేఖ స్పష్టం చేశారు.