అల్లూరి జిల్లాలో జనసేన బలోపేతం: స్థానిక పోరులో కూటమి విజయమే లక్ష్యం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: జీకే వీధి

అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ పరిధిలోని దారలగొంది గ్రామంలో జనసేన పార్టీ బలోపేత కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. జనసేన నాయకుడు కొర్ర శ్రియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు మరియు మన్యం ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించడం జరిగింది.