భారీ అడ్వాన్స్ బుకింగ్స్‌తో థియేటర్లలోకి అవెంజర్స్ ఎండ్ గేమ్ రీ-రిలీజ్

రిపోర్టర్: సతీష్ స్థలం: India

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మార్వెల్ సినిమా అవెంజర్స్ ఎండ్ గేమ్ ఎన్‌కోర్ మరోసారి థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 25వ తేదీన జరగనున్న ఈ రీ-రిలీజ్ కోసం భారత్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. Sacnilk నివేదిక ప్రకారం, ఆరు షో తేదీలకు సంబంధించి ఇప్పటివరకు రూ. 13.23 కోట్ల వసూళ్లు సాధించాయి. కేవలం తొలి రోజునే రూ. 5.05 కోట్ల గ్రాస్ కలెక్ట్ కావడంతో సినిమాపై అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ స్పష్టంగా కనిపిస్తోంది.