ఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్: రాహుల్ గాంధీ, ప్రియాంక అరెస్ట్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: న్యూఢిల్లీ
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ఇండియా కూటమి నేతలు చేపట్టిన నిరసన ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జంతర్ మంతర్ వైపు మార్చ్ చేయడానికి ప్రయత్నించిన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా తదితర విపక్ష నేతలను ఢిల్లీ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. బారాఖంబా రోడ్ పోలీస్ స్టేషన్కు తరలించి కొద్దిసేపటి తర్వాత వారిని విడుదల చేశారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.