వెండితెరపై భారీ రామాయణం అద్భుతం: నటీనటుల ఆసక్తికర అనుభవాలు

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

భారతీయ ఇతిహాసగాథ ఆధారంగా ఆధునిక సాంకేతికతతో తెరకెక్కిన రామాయణం సినిమా మరో నాలుగు రోజుల్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీరాముడిగా నటిస్తున్న రణ్బీర్ కపూర్, రావణుడిగా కనిపించనున్న యశ్ తమ అనుభవాలను పంచుకున్నారు. శ్రీరాముడి పాత్రకు న్యాయం చేయడానికి రెండేళ్లు యోగా సాధన చేశానని, ఎంతోమంది పండితులను కలిశానని రణ్బీర్ కపూర్ తెలిపారు. రావణుడి పాత్ర కోసం ఈగోను పక్కనపెట్టి పనిచేశానని నటుడు యశ్ వెల్లడించారు.