స్థానిక ఎన్నికల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం టికెట్లు కేటాయింపు
రిపోర్టర్: సురేష్
స్థలం: ప్రకాశం
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున ముప్పై నాలుగు శాతం టికెట్లను బీసీలకే కేటాయించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అలాగే కొండపి ఎమ్మెల్యే అయిన డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. పార్టీ ఆవిర్భావం నుంచీ బీసీలే వెన్నెముకగా నిలిచారని ఆయన పేర్కొంటూ, సుప్రీంకోర్టు తీర్పుతో ఎలాంటి సంబంధం లేకుండా స్థానిక ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తూ టీడీపీ తన నిబద్ధతను చాటుకుంటున్నట్లు స్పష్టం చేశారు.