కోనసీమలో వరుణ జపం: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా యాగం
రిపోర్టర్: సునీల్
స్థలం: కోనసీమ
కోనసీమ జిల్లాలోని అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ వరుణ జపం, యాగం అత్యంత వైభవంగా ప్రారంభమైనట్లు ఆలయ అర్చకులు తెలిపారు. లోకకల్యాణార్థం దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి అన్నదాతలకు మేలు జరగాలని విఘ్ననాయకుడిని ప్రార్థిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.