పశ్చిమ బెంగాల్లో విజయ్ పార్టీ తొలి కార్యాలయం ప్రారంభం
రిపోర్టర్: గోపి
స్థలం: Kolkata
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం పార్టీ ఇప్పుడు ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించింది. పశ్చిమ బెంగాల్లోని పూర్బ బర్ధమాన్ జిల్లాలో టీవీకే తన మొట్టమొదటి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర కోఆర్డినేటర్ చైతాలి రాయ్ వెల్లడించారు. రాజకీయ కార్యకలాపాల కంటే సామాజిక సంక్షేమం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలకే తమ పార్టీ తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు.