బ్యాంకు వినియోగదారులకు కీలక హెచ్చరిక: చెక్కులపై ఓన్లీ రాయకుంటే భారీ మోసం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

చెక్కులు రాసే సమయంలో మొత్తాన్ని రాశాక 'ఓన్లీ' అని తప్పనిసరిగా రాయాలని, లేదంటే మోసగాళ్లు ఆ ఖాళీలను ఆసరాగా చేసుకుని అంకెలను మార్చే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేశారు. చెక్ కు జారీ చేసే ప్రతి ఒక్కరూ ఈ చిన్న జాగ్రత్త పాటిస్తే భారీ ఆర్థిక నష్టాలను నివారించవచ్చని బ్యాంకింగ్ అధికారులు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిపై ఎలాంటి ప్రత్యేక నిబంధన పెట్టకపోయినా భద్రత కోసం ఈ పద్ధతి పాటించాలని సూచించారు.