'బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు': కేటీఆర్ స్పష్టత

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో తమ పార్టీ జతకట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్యానాలోని సోనిపట్ వేదికగా స్పష్టం చేశారు. హర్యానాలోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీతో పొత్తుపై వస్తున్న వార్తలు కేవలం రాజకీయ దురుద్దేశంతో కూడినవేనని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను ఖండిస్తూ, భవిష్యత్తులో బీఆర్ఎస్ తన స్వశక్తిపైనే రాజకీయ పోరాటం చేస్తుందని నొక్కిచెప్పారు.