మహిళపై కానిస్టేబుల్ దాడి మరియు ఈడ్చుకెళ్లిన అమానుష ఘటన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హఫీజ్‌పేట్

హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ పరిధిలో తీవ్ర అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ మహిళపై రైల్వే పోలీస్ కానిస్టేబుల్ విచక్షణారహితంగా దాడి చేశాడు. మహిళను కొట్టి, ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. రక్షించాల్సిన పోలీసులే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడటంపై ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.