జన్నారం మండలంలో బతుకమ్మ సంబరాలు: ఉత్సాహంగా ఆడిపాడిన మహిళలు, యువతులు
రిపోర్టర్: User
స్థలం: జన్నారం
జన్నారం మండలంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. అన్ని గ్రామాలలో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొని ఆడిపాడారు. పోన్కల్ గ్రామం శ్రీలంక కాలనీలో అల్లనేరేళ్ల పాటలతో సందడి చేశారు. ధర్మారం, కిష్టాపూర్, కలమడుగు, మురిమడుగు గ్రామాలలో కూడా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది.