అమెజాన్ ఫెస్టివల్ జోరు: తెలంగాణలో పండగ షాపింగ్తో భారీగా పెరిగిన విక్రయాలు

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా పండగ షాపింగ్ జోరందుకుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. హైదరాబాద్లో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల విక్రయాలు పది రెట్లు పెరిగినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆరు వేలకు పైగా విక్రేతలు ఈ సీజన్లో పాల్గొన్నారని తెలిపారు. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు. వినియోగదారుల కొనుగోళ్లతో వ్యాపార రంగంలో నూతన వృద్ధి నమోదవుతోందని అమెజాన్ వివరించింది.