స్థానిక సంస్థల ఎన్నికల సమరం: మేయర్, ఛైర్మన్ల రిజర్వేషన్లపై రేపే ప్రకటన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమరావతి
రాష్ట్రంలో మేయర్ మరియు మున్సిపల్ ఛైర్పర్సన్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను సోమవారం ప్రకటించనున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ వెల్లడించింది. రాష్ట్రం యూనిట్‌గా రొటేషన్ పద్ధతిలో 17 మేయర్, 106 మున్సిపల్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్ల స్థానాలకు జిల్లా యూనిట్‌గా కలెక్టర్లు మంగళవారం ప్రకటిస్తారని అధికారులు తెలిపారు. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు గరిష్ఠంగా 50 శాతం ఉండాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది.