నాగర్కోయిల్లో యూట్యూబర్ మధుమిత ఇంట్లో కోటి రూపాయల బంగారం చో

రిపోర్టర్: వెంకట్ స్థలం: Nagercoil

నాగర్కోయిల్లో ప్రముఖ యూట్యూబర్ మధుమిత ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆమె ఇంట్లో సుమారు నూట పద్దెనిమిది కాసుల బంగారం చోరీకి గురైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నగలు విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రాత్రి సమయంలో ఇంటి వెనుక తలుపులు పగులగొట్టి దొంగలు ఈ దురాగ్యానికి పాల్పడినట్లు తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు వేగవంతం చేశారు.