ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీలో కశ్మీర్కు తీవ్ర అన్యాయమంటూ సజాద్ లోన్ ధ్వజం

రిపోర్టర్: మహేష్ స్థలం: Srinagar

పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజాద్ లోన్ జమ్మూకశ్మీర్లో ఆర్థికంగా బలహీన వర్గాల రిజర్వేషన్ల అమలుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిబంధనల వల్ల కశ్మీర్ లోయలోని నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. పేదరిక నిర్ధారణలో వైరుధ్యాలు ఉన్నాయని, జమ్మూ ప్రాంతానికే ఎక్కువ లబ్ధి చేకూరుస్తూ కశ్మీర్కు తీవ్ర ద్రోహం చేస్తున్నారని సజాద్ లోన్ శాసనసభ వేదికగా నిలదీశారు.