విజయనగరం రాజకీయం: బొత్స కుటుంబ ఆధిపత్యానికి గజపతినగరంలో ఎదురుదెబ్బ
రిపోర్టర్: గోపి
స్థలం: విజయనగరం
గజపతినగరం నియోజకవర్గంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆధిపత్యానికి తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నాయని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. బొండపల్లి జెడ్పీటీసి అభ్యర్థిగా బొత్స అనూష బరిలో నిలవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దూకుడు, వైకాపా క్యాడర్ లోని ఐక్యతా లోపం ఆ కుటుంబానికి ఇబ్బందికరంగా మారిందని స్థానికులు విశ్లేషిస్తున్నారు.