ఏపీలో తుఫాన్ సహాయక చర్యల కోసం మోత్కూర్ విద్యుత్ సిబ్బంది తరలింపు
రిపోర్టర్: Srinivasulu akavaram
స్థలం: మోత్కూరు
ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు యాదాద్రి జిల్లా మోత్కూర్ నుంచి విద్యుత్ సిబ్బంది తరలివెళ్లారు. మోత్కూర్ సబ్ డివిజన్‌కు చెందిన ఏడుగురు కాంట్రాక్టర్లు, అరవై ఐదు మంది సిబ్బంది రెండు లారీలు, రెండు వాహనాల్లో అవసరమైన పరికరాలతో ఏపీకి బయలుదేరారు. ఏడీ బాలు నాయక్, ఏఈ ప్రభాకర్ రెడ్డి వాహనాలను జెండా ఊపి ప్రారంభించగా, తుఫాన్ బాధితులకు విద్యుత్ సరఫరాను త్వరలోనే పునరుద్ధరించనున్నారు.