హైదరాబాద్‌లో వైభవంగా ప్రారంభమైన డిజైన్ డెమోక్రసీ 2026 ఉత్సవం
రిపోర్టర్: శివ
స్థలం: Hyderabad
భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన డిజైన్ ఫెస్టివల్‌గా గుర్తింపు పొందిన డిజైన్ డెమోక్రసీ నాలుగవ ఎడిషన్ హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో వైభవంగా ప్రారంభమైంది. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవంలో దేశవ్యాప్తంగా ఉన్న 200కు పైగా ప్రముఖ డిజైన్ బ్రాండ్లు, 150 మందికి పైగా నిష్ణాతులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.