రాహుల్ గాంధీకి అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్: 2029లో ఓటమికి సిద్ధంగా ఉండండి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: New Delhi
ఎన్నికల్లో వరుస ఓటములపై నిరాధార ఆరోపణలు మాని 2029 లోక్సభ ఎన్నికల్లో ఎదురయ్యే భారీ ఓటమికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హితవు పలకడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ వైఖరిని ఆయన తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. ఓటములన్నింటికీ రాజ్యాంగ వ్యవస్థలపై నిందలు వేయడం మాని ఆత్మపరిశీలన చేసుకోవాలని అమిత్ షా సూచించారు.