దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ వివరాలు వెల్లడి

రిపోర్టర్: గోపి స్థలం: India

ప్రపంచంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలును జపాన్ 1964లో ప్రారంభించగా, చైనా ఈ రంగంలో అగ్రస్థానంలో నిలిచింది. భారతదేశం కూడా ప్రపంచ దేశాల సరసన నిలిచేందుకు ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌ను వేగవంతం చేసింది. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో భాగంగా సూరత్ నుంచి బిలిమోరా మధ్య తొలి విడత సేవలు 2027 ఆగస్టు నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.