చెరువులో విగ్రహాల నిమజ్జనంతో జీవనోపాధి కోల్పోతున్న మత్స్యకారుల ఆక్రోశం
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం అర్బన్ పరిధిలోని ద్వంసలాపూరం పెద్ద చెరువులో వినాయక విగ్రహాల నిమజ్జనం చేయవద్దని కొత్తగూడెం మత్స్యకారుల సొసైటీ అధ్యక్షుడు ముద్రబోయిన అప్పారావు, పగడాల మల్లేష్ డిమాండ్ చేశారు. నిమజ్జనం వల్ల చేపలు మృత్యువాత పడి సుమారు 80 కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. చేపల పెంపకానికి సభ్యులు అప్పులు చేసి సుమారు కోటి రూపాయలు పెట్టుబడి పెట్టామని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ నిమజ్జన ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని, నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు.