వైఎస్సార్ నగర్ పేదల గుడిసెల తొలగింపుపై కాంగ్రెస్ సర్కార్ తీరును నిలదీసిన దాస్యం వినయ్ భాస్కర్

రిపోర్టర్: రమేష్ స్థలం: Hanumakonda

కాజీపేట వైఎస్సార్ నగర్ లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదల గుడిసెలను అక్రమంగా తొలగించడం కాంగ్రెస్ ప్రభుత్వ నియంతత్వానికి నిదర్శనమని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన ఆ ప్రాంతంలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. ఏ ఒక్క గుడిసెవాసి భయపడవద్దని, మీ తరఫున తాము నిలబడి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పేదల ఉసురు తగిలి ప్రభుత్వం త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.