అమెరికాలో వైభవంగా బతుకమ్మ సంబరాలు: పాల్గొనాలని ప్రవాసులకు నిర్వాహకుల పిలుపు

రిపోర్టర్: రాము స్థలం: సియాటిల్

అమెరికాలోని సియాటిల్లో అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు 2026ను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ 17వ తేదీన వసా పార్క్ రిసార్ట్లో ఈ వేడుకలు జరగనున్నాయని, ప్రవాస తెలుగువారందరూ కుటుంబసభ్యులతో కలిసి భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ వేడుకల్లో ప్రత్యేక సంగీతం, డిస్కో డాండియా, బతుకమ్మ పోటీలు, రుచికరమైన ఆహారంతో పాటు ప్రముఖ నటి అశ్విని శర్మ ప్రత్యేక ఆకర్షణగా విచ్చేయనున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.