మిషన్ భగీరథపై ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆకస్మిక తనిఖీ

రిపోర్టర్: అశోక్ స్థలం: సిద్దిపేట

గ్రామీణ ప్రాంత ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు. కుకునూరుపల్లి మండలం మంగోలు గ్రామ శివారులోని మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఆయన పరిశీలించారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.