సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్: భారీ నగదు బహుమతులు ప్రకటన
రిపోర్టర్: రమేష్
స్థలం: Andhra Pradesh / Telangana
సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ పోటీల కింద ప్రతి కేటగిరీలో మొదటి బహుమతికి పది లక్షలు, రెండో బహుమతికి ఐదు లక్షలు, మూడో బహుమతికి మూడు లక్షల రూపాయల చొప్పున నగదు బహుమతులు అందజేయనున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాఠశాలలు, ఐటీఐలు, పాలిటెక్నిక్లతో పాటు వివిధ వర్గాల విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతిభావంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.