ఓటర్లకు కేజీ చికెన్ ఫ్రీ: నెల్లూరులో కాంగ్రెస్ అభ్యర్థి బరితెగింపు

రిపోర్టర్: అశోక్ స్థలం: నెల్లూరు

నెల్లూరులో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారని స్థానికులు తెలిపారు. ఓటరు చీటీ ఉంటే ఒక్కో స్లిప్పునకు కేజీ చికెన్ ఉచితంగా ఇస్తామని ప్రచారం చేయడంతో వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీలోని దుకాణం వద్ద ప్రజలు ఎగబడ్డారని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఆ దుకాణాన్ని మూసివేశారని సమాచారం.