మహనీయుల స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

రిపోర్టర్: కిరణ్ స్థలం: పెద్దపల్లి

గడ్డం వెంకటస్వామి కాక జయంతి వేడుకలలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహనీయుల ఆశయాలను, సేవలను స్మరించుకుంటూ వారి బాటలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధి కోసం వారు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష (Collector Peddapalli) పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు అలాగే ప్రముఖులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.