రాత్రివేళ ముమ్మరంగా పోలీస్ పెట్రోలింగ్.. ఎస్పీ హెచ్చరిక!
రిపోర్టర్: RAVI BABU
స్థలం: వెదురుకుప్పం
తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు రాత్రివేళ ప్రత్యేక నైట్ రౌండ్స్, ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు సున్నిత ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.
అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామని అధికారులు తెలిపారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.