వాహనదారులకు కేంద్రం భారీ ఊరట, అందుబాటులోకి ఫాస్టాగ్ పోర్టబులిటీ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: భారతదేశం
దేశంలోని వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ పోర్టబులిటీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై పాత స్టిక్కర్ మార్చకుండానే ఒకే స్టిక్కర్‌తో నచ్చిన బ్యాంకుకు మారే సదుపాయాన్ని కల్పించారు. 'రాజ్ మార్గ్ యాత్ర' యాప్ ద్వారా ఈ సేవలను పొందవచ్చు. దీనివల్ల స్టిక్కర్లు పదే పదే మార్చే శ్రమ తగ్గి టోల్ సేవలు మరింత వేగవంతం కానున్నాయి.