గత చేదు జ్ఞాపకాలను అధిగమించి విజయం సాధించానన్న షూటర్ ఏలవెనిల్

రిపోర్టర్: కృష్ణ స్థలం: జపాన్

టోక్యో ఒలింపిక్స్ లో ఎదురైన చేదు అనుభవాలను అధిగమించి ఆసియా క్రీడల్లో రాణించానని భారత స్టార్ షూటర్ ఏలవెనిల్ వలరివన్ వెల్లడించారు. 2021 టోక్యో ఒలింపిక్స్ లో 16వ స్థానంలో నిలిచి తీవ్ర నిరాశ చెందానని, కానీ ఆ జ్ఞాపకాలను వెనక్కి నెట్టి ప్రస్తుత టోర్నీపై దృష్టి సారించానని తెలిపారు. తన మెంటార్ గగన్ నారంగ్ సూచనలు, కోచ్ నేహా చవాన్ కృషి తన విజయానికి ఎంతో దోహదపడ్డాయని ఆమె పేర్కొన్నారు.