గూగుల్‌బుక్ పేరుతో కొత్త ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టిన టెక్ దిగ్గజం గూగుల్
రిపోర్టర్: వెంకట్
స్థలం: Hyderabad
ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారుల కోసం గూగుల్ సంస్థ కొత్తగా గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్ కేటగిరీని ప్రవేశపెట్టింది. క్రోమ్‌ఓఎస్ ఫౌండేషన్‌పై ఆండ్రాయిడ్ టెక్ స్టాక్‌తో దీన్ని రూపొందించగా, ఇందులో జెమిని ఏఐ ఇంటిగ్రేషన్ ఉంది. అమెరికా తదితర గ్లోబల్ మార్కెట్లలో 899 డాలర్ల ప్రారంభ ధరతో ప్రీ-ఆర్డర్లు మొదలయ్యాయి. భారత్‌లో లాంఛ్ పై ఇంకా స్పష్టత రాలేదు.