వదంతుల విషవలయాన్ని ఛేదిస్తూ స్పష్టతనిచ్చిన టీటీడీ యంత్రాంగం
రిపోర్టర్: RAVI BABU
స్థలం: వెదురుకుప్పం
తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాల సంఖ్యపై ఎలాంటి పరిమితులు లేదా ఆంక్షలు విధించలేదని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. రోజుకు పదిహేను వేల వాహనాలను మాత్రమే అనుమతిస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. దేవస్థానం అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ భక్తులను అయోమయానికి గురిచేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ గట్టిగా హెచ్చరించింది.