తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు: ప్రత్యేక వాహనాలపై మలయప్పస్వామి ఊరేగింపు

రిపోర్టర్: కృష్ణ స్థలం: తిరుమల

తిరుమలలో జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాముఖ్యత ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. దేవీ శరన్నవరాత్రుల సమయంలో నిర్వహించే ఈ ఉత్సవాల్లో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వివిధ వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్యదర్శనం కల్పిస్తారని పేర్కొన్నారు. స్వామివారి వాహన సేవలను కనులారా తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తిరుమలకు తరలివస్తున్నారని, అన్ని ఏర్పాట్లు ఘనంగా కొనసాగుతున్నాయని దేవస్థానం వర్గాలు వెల్లడించాయి.