పరీక్షల సంస్కరణలపై ప్రజల నుంచి సలహాలు కోరిన ఎన్టీఏ

రిపోర్టర్: మహేష్ స్థలం: India

దేశవ్యాప్త పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా, పటిష్టంగా మార్చేందుకు ఎన్టీఏ హై-పవర్డ్ టాస్క్ ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి నిర్మాణాత్మక సలహాలను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల వారు సెప్టెంబర్ 13లోపు ఈమెయిల్, వాట్సాప్ లేదా టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. పరీక్షా విధానంలో సమూల మార్పుల కోసం ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.