పోలీస్ అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని స్పష్టం చేసిన సీపీ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వరంగల్

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం హనుమకొండ పోలీస్ హెడ్క్వార్టర్స్లోని అమరుల స్తూపం వద్ద సీపీ ఎన్. శ్వేత, కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్య శారద, ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు నివాళులర్పించారు. విధి నిర్వహణలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇరవై ఐదు మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని ఘనంగా హామీ ఇచ్చారు.